తొలిరోజే పలు కేసులు విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా
- కొత్త సీజేఐగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా
- మొదటి రోజే 45 కేసులు విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా
- జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ఘన స్వాగతం పలికిన న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆయన తన పని తీరులో వేగం ప్రదర్శించారు. ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలి రోజే ఏకంగా 45 కేసులను విచారించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించిన తర్వాత సీజేఐ హోదాలో కోర్టు హాలులోకి అడుగు పెట్టగా.. జస్టిస్ సంజీవ్ ఖన్నాకు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన పదవీ కాలం ఫలవంతంగా సాగాలని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తదితరులు ఆకాంక్షించారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ సీజేఐ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల వరకూ సీజేఐ సంజీవ్ ఖన్నా సోమవారం లిస్ట్ చేసిన 45 కేసులను విచారించారు. వీటిలో ఎక్కువగా వాణిజ్యపరమైన వివాదాలకు సంబంధించినవే ఉన్నాయి.
కాగా, సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం ఆదివారంతో ముగియడంతో ఆయన స్థానంలో సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టారు. ఆయన వచ్చే సంవత్సరం మే 13 వరకూ పదవిలో కొనసాగనున్నారు.