రేపు ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: అయ్యన్న

  • ఎల్లుండికి వాయిదా పడిన ఏపీ అసెంబ్లీ, మండలి
  • రేపు మధ్యాహ్నం టీడీపీ-జనసేన-బీజేపీ శాసనసభాపక్ష భేటీ
  • వచ్చే శనివారం కూడా సభ నిర్వహిస్తామన్న అయ్యన్నపాత్రుడు
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి ఎల్లుండికి వాయిదా పడ్డాయి. రేపు (నవంబరు 12) ఉదయం ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. 

కాగా, అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. నవంబరు 22 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ఏదో లాంఛనంగా అన్నట్టుగా కాకుండా, సీరియస్ గా జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

బడ్జెట్ పై రేపు ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు ఉంటాయని అయ్యన్నపాత్రుడు తెలిపారు. వచ్చే శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. బిల్లులు, చర్చలకు సమయం లభించేలా రెండు పూటలా సభ నిర్వహిస్తామని చెప్పారు. 

ఎనిమిది బిల్లులు సహా, వివిధ ప్రభుత్వ పాలసీలకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం లభించనుందని పేర్కొన్నారు.


More Telugu News