మతిమరుపు మంచిదే... మర్చిపోకుంటేనే డేంజర్... ఎందుకలా?
- మతిమరుపు అనేది లేకుంటే ఎంతో ప్రమాదమంటున్న శాస్త్రవేత్తలు
- కొత్త జ్ఞాపకాలను నిక్షిప్తం చేసే ప్రక్రియలో మతిమరుపు ఓ భాగమని వెల్లడి
- మానవ పరిణామ క్రమానికి కూడా దీనితో తోడ్పాటు
ఏదో ఫంక్షన్ లో ఎవరో కనిపించారు... ఎక్కడో చూసినట్టు, బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వారెవరో వెంటనే తట్టదు. ఏదో చెబుదామని మీ స్నేహితుడి దగ్గరికి వచ్చారు... మాట్లాడుతుండగానే అసలు విషయం మర్చిపోయారు. ఏదో చెబుదామని వచ్చా, గుర్తుకురావట్లే అని తలపట్టుకుంటారు... చాలా మందికి ఏదో ఒక సమయంలో ఇలాంటి అనుభవాలు ఎదురువుతూనే ఉంటాయి. అమ్మో మతిమరపు వస్తోందేమో అని ఆందోళన మాత్రం అవసరం లేదు. ఎందుకంటే మతిమరపు మంచిదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కొత్త జ్ఞాపకాల కోసం... పాతవి మరుగుపడుతూ.. .
మన జీవితంలో కొత్త అంశాలను నేర్చుకోవడానికి, జ్ఞాపకాల (మెమరీ)ని అప్‌డేట్ చేసుకోవడానికి జరిగే ప్రక్రియలో మతిమరపు ఓ భాగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు మనిషి మనుగడకు ఇది అత్యంత ఆవశ్యకమని తేల్చి చెప్తున్నారు. ఒకప్పుడు మనుషులు గుహల్లో ఉంటూ, వేటాడి బతికేవారు. దగ్గర్లోని చెరువుల నుంచి నీళ్లు తెచ్చుకునేవారు. ఎప్పుడైనా అలా వెళ్లినప్పుడు... సింహం, పులి వంటి క్రూర జంతువులు కనిపిస్తే, ఆ ప్రాంతం ప్రమాదకరమని మెదడులో జ్ఞాపకం అప్‌డేట్ అవుతుంది. ఈసారి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, మరో చెరువు వెతుక్కోవాలని ప్రేరేపిస్తుంది. ఇది మానవ పరిణామానికి తోడ్పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఎందుకలా.. ఏం జరుగుతుంది?
మన మెదడులోని కణాలు (న్యూరాన్ల) మధ్య ఏర్పడే బంధాలు (సినాప్సెస్) ఎంత దృఢంగా ఉంటే... అక్కడ నిక్షిప్తమైన జ్ఞాపకం అంతగా మనలో నాటుకుపోయి ఉంటుంది. ఏదైనా పనిని ప్రత్యేక శ్రద్ధతో, ఏకాగ్రతతో, ఇష్టంతో చేసినప్పుడు.. లేదా ఒకే పనిని తరచూ చేస్తూ ఉన్నప్పుడు... ఆ అంశానికి సంబంధించిన బంధాలు బలంగా ఏర్పడి జ్ఞాపకం (మెమరీ)గా మారుతాయి. దానిపై ప్రత్యేకంగా ఆలోచించే పనిలేకుండా... ఆటోమేటిక్ మెమరీగా నిక్షిప్తం అవుతాయి. అదే మనం దేనిపైనైనా సరిగా శ్రద్ధపెట్టకుంటే... బంధాలు బలహీనంగా ఉండి, జ్ఞాపకం సరిగా నమోదుకాదు.. అలాంటి వాటిని మెదడు ఎప్పటికప్పుడు తొలగించేస్తుంది. అదే మతిమరపు. అక్కడ కొత్త జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకుంటుంది. ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎరిక్ కండెల్ తన పరిశోధనలో ఈ విషయాన్ని తేల్చారు.
ఒక చిన్న ఉదాహరణ చూస్తే..
మీరు వ్యాపారం కోసం రోజూ ఒకేదారిలో ప్రయణిస్తుంటారు. ఆ దారిలో మలుపులు, గుంతలు, దారిలోని చెట్లు, జంక్షన్లు ఇలా అన్ని అంశాలు బలంగా నిక్షిప్తమై... ఆటోమేటిక్ మెమరీగా మారుతాయి. ఎప్పుడైనా ఆ రోడ్డు వదిలి మరో మార్గంలో ప్రయాణించాల్సి వస్తే... మెదడులో మన ప్రయాణ మార్గం మెమరీ మారిపోవాల్సి వస్తుంది. మనం వెళ్లే కొత్త మార్గంలోని మలుపులు, గుంతలు, దారిలోని చెట్లు, జంక్షన్లు వంటివి స్టోర్ అవుతాయి. ఇందుకోసం మన మెదడు మొదటి రోడ్డుకు సంబంధించిన న్యూరాన్ బంధాలను బలహీనం చేసి, అంటే పాత డేటాను కొంతమేర తొలగించి... కొత్త వివరాలను అప్‌డేట్ చేసుకుంటుంది. ఇలా చేయకపోతే జ్ఞాపకాలు చిక్కుముడి పడి (మెమరీ క్లట్టర్) సమస్యాత్మకంగా మారుతాయి.
మరిచిపోకుంటే... మనుగడకే ముప్పు
మతిమరుపు లేకుంటే ఎంతో ప్రమాదకరం కూడా. ‘పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్‌డీ)’... అంటే ఏదైనా ప్రమాదానికో, భయానక ఘటనకో గురైనప్పుడు ఆ జ్ఞాపకాలు లోతుగా నిక్షిప్తమైపోతాయి. ఆ వ్యక్తులను నిత్యం వెంటాడుతుంటాయి. వారు ఆ ఘటనలు తమ కళ్ల ముందే మళ్లీ, మళ్లీ జరుగుతున్నట్టుగా భయోత్పాతానికి లోనవుతారు. మానసిక ఆందోళనలో మునిగిపోయి... దారుణమైన జీవితం గడుపుతారు. అదే ఆ జ్ఞాపకాలను మరిచిపోగలిగితే, లేదా మరుగునపడేస్తే... తిరిగి గాడినపడతారు.
కొత్త జ్ఞాపకాల కోసం... పాతవి మరుగుపడుతూ..