అందం పెట్టుకున్న పేరే అనంతిక!
- 'మ్యాడ్'తో ఎంట్రీ ఇచ్చిన అనంతిక
- ఫస్టు మూవీతోనే యూత్ కి చేరువైన బ్యూటీ
- సోషల్ మీడియాలో పెరుగుతున్న ఫాలోవర్స్
- త్వరలో విడుదల కానున్న '8 వసంతాలు'
- త్వరలో చక్రం తిప్పే అవకాశాలు పుష్కలం
సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టడం .. కథానాయికగా ఒక అవకాశాన్ని సంపాదించుకోవడం .. తొలి సినిమాతోనే ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకోవడం... యూత్ నుంచి మంచి ఫాలోయింగును పెంచుకోవడం అంత తేలికగా జరిగే పనులు కాదు. అందరి విషయంలో జరిగే పనులు కాదు. అలాంటి అరుదైన ఛాన్స్ ను దక్కించుకున్న కథానాయికగా 'అనంతిక సనల్ కుమార్' కనిపిస్తుంది.
తెలుగు తెరపై ఈ మధ్య కాలంలో చాలా తక్కువ వయసులోనే మెరిసిన కథానాయిక కృతి శెట్టి అనే చెప్పాలి. ఆమె కంటే చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీగా అనంతిక కనిపిస్తుంది. 'మ్యాడ్' సినిమాతో ఈ అమ్మాయి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి మార్కులను కొట్టేసింది. అనంతికను చూసిన కుర్రాళ్లంతా ఆ సినిమా నుంచి ఆమె అభిమానులుగా మారిపోయారు.
చక్కని కనుముక్కుతీరు... ఆకర్షణీయమైన రూపంతో అనంతిక ఆకట్టుకుంటుంది. ఆమె కళ్ల కదలికలు చేసే గారడీ... చూపుల విన్యాసాలకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య అలా పెరిగిపోతూ వస్తోంది. నాజూకుగా కనిపిస్తున్నప్పటికీ ఈ సుందరికి కర్రసాములో... మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది. అదే ఆమెకి '8 వసంతాలు' సినిమాలో ఛాన్స్ తెచ్చిపెట్టింది. మైత్రీ మూవీస్ వారి ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఇక్కడ అనంతిక జోరు పెరగడం ఖాయమనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.