అడుగుకో ట్విస్ట్ .. ఓటీటీలో తమిళ హిట్ మూవీ!
- తమిళంలో రూపొందిన 'సట్టం ఎన్ కైయిల్'
- క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
- సెప్టెంబర్లో థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ నెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్
- ఆసక్తిని రేకెత్తించే స్క్రీన్ ప్లే
తమిళంలో ఈ మధ్య కాలంలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలలో 'సట్టం ఎన్ కైయిల్' ఒకటి. సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. సతీశ్ .. అజయ్ రాజ్ .. పావెల్ నవగీతన్ .. విద్యా ప్రదీప్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి 'చాచి' దర్శకత్వం వహించాడు. థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, ఈ నెల 8వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా .. చాలా సహజంగా మొదలవుతుంది. గౌతమ్ అనే క్యాబ్ డ్రైవర్ ఓ రాత్రివేళ తన కారులో ప్రయాణిస్తూ, బైక్ పై ఎదురుగా వచ్చిన వ్యక్తిని ఢీ కొడతాడు. హెల్మెట్ ధరించడం వలన ఆ వ్యక్తి ఫేస్ కనిపించదు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని తన కారు డిక్కీలో పడుకోబెట్టి, ఓ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులకు దొరికిపోతాడు. తన కారు డిక్కీని పోలీసులు చూడకుండా వారితో గొడవపడి స్టేషన్ కి వెళతాడు.
ఆ సమయంలో ఓ యువతీ డెడ్ బాడీ ఫలానా ప్రాంతంలో దొరికినట్టుగా పోలీసులకు కాల్ వస్తుంది. ఆ యువతి పేరు నివేత అని పోలీసులు తెలుసుకుంటారు. నివేత ఎవరు? ఆమెను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? నివేత చనిపోవడానికీ .. గౌతమ్ కి ఏమైనా సంబంధం ఉంటుందా? గౌతమ్ కారు డిక్కీలో ఉన్నది ఎవరు? అనే మలుపులతో ఈ కథ ఉత్కంఠను రేకెత్తిస్తుంది. త్వరలోనే తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.