తెలంగాణ మహిళకు అమెరికాలో కీలక బాధ్యతలు!
- ఖమ్మం నగరానికి చెందిన మహిళ రాధిక
- అమెరికాలోని కొలంబస్‌లో ఉంటున్న రాధిక
- ఒహియో మైనార్టీ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ అడ్వైజరీ బోర్డు సలహాదారుగా నియామకం
తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామసహాయం రాధికకు అమెరికాలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం నగరానికి చెందిన రామసహాయం బుచ్చిరెడ్డి, నిర్మల దంపతుల కూతురు రాధిక. ఆమె అమెరికాలోని కొలంబస్‌లో ఉంటున్నారు. ఓ సాఫ్టువేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
తాజాగా రాధికను ఒహియో రాష్ట్ర మైనార్టీ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ అడ్వైజరీ బోర్డు సలహాదారుగా నియమిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాధిక తండ్రి బుచ్చిరెడ్డి వెల్లడించారు.
రాధిక 2009లో గద్వాల్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. పెళ్లి చేసుకొని భర్త రఘురాంరెడ్డితో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడ వివిధ కంపెనీల్లో పలు హోదాల్లో పని చేశారు. నేషన్‌వైడ్ కంపెనీ సాఫ్టువేర్ డైరెక్టర్‌గా రాధిక బాధ్యతలు నిర్వర్తించారు.