రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్
- 2024–25 బడ్జెట్ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
- మరికాసేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్
- వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభా సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94 లక్షల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాలను రూపొందించింది. కాగా, ఈ ఏడాదికి సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఉదయం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. అంతకుముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేశ్, నారాయణ, పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, సవిత, తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళి అర్పించారు.