ఏపీలోని పలు చోట్ల రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు

  • రాయలసీమ, దక్షిణ కోస్తాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
  • నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి
  • అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ అప్రమత్తం చేశారు. నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, దీని ప్రభావంతో మంగళ, బుధ, గురువారాల్లో వానలు పడతాయని చెప్పారు.

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి మంగళవారం లోగా అల్పపీడనంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గుర్తించింది. తర్వాత రెండు రోజుల్లో పశ్చిమ దిశగా కదులుతుందని, తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు పయనించే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, నిన్న ఏపీలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడ్డాయి.


More Telugu News