బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు: హరీశ్ రావు

  • ఎన్నికల హామీలను రేవంత్ రెడ్డి అమలు చేయడంలేదన్న హరీశ్ రావు
  • రైతులు రోడ్డు ఎక్కకుండా చూడాలన్న బీఆర్ఎస్ సీనియర్ నేత
  • రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్
తెలంగాణలో హామీలను అటకెక్కించిన రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వెళ్లి అబద్ధాలు చెబుతున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణలో వరి మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడని వెల్లడించారు. 

"రైతుల నుంచి ధాన్యం సకాలంలో కొనుగోలు చేయడం, మద్దతు ధరకు రూ.500 బోనస్ ఇవ్వడం అంటే... మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి, తిమ్మిని బమ్మిని చేసి అధికారంలోకి రావడం కాదు రేవంత్ రెడ్డి గారూ! పౌరసరఫరాల శాఖ మంత్రి సొంత జిల్లా మిర్యాలగూడలో నడిరోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రైతన్న దీనస్థితిని పట్టించుకోండి ముఖ్యమంత్రి గారూ...!

రైతులు రోడ్డు ఎక్కకుండా, ఇచ్చిన మాట ప్రకారం మద్దతు ధరపై రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలి" అంటూ హరీశ్ రావు డిమాండ్ చేశారు.


More Telugu News