టాపార్డర్ ఫెయిల్... టీమిండియా స్వల్ప స్కోరు
- గాబెర్హాలో టీమిండియా, దక్షిణాఫ్రికా రెండో టీ20
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు
- డకౌట్ అయిన సంజూ శాంసన్
- రాణించిన హార్దిక్ పాండ్యా
దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది.
గాబెర్హాలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత టాపార్డర్ విఫలమైంది. తొలి మ్యాచ్ లో సెంచరీ చేసిన సంజూ శాంసన్ నేటి మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (4), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (4) తక్కువ స్కోరుకే అవుటయ్యారు.
మిడిలార్డర్ లో తిలక్ వర్మ (20), అక్షర్ పటేల్ (27) ఫర్వాలేదనిపించగా... హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) రాణించాడు. రింకూ సింగ్ (9) నిరాశపరిచాడు.
ఆతిథ్య సఫారీ బౌలర్లలో మార్కో యన్సెన్, గెరాల్డ్ కోట్జీ, ఆండిలె సిమిలేన్, కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్, ఎన్ కబయోంజి పీటర్ తలో వికెట్ తీశారు.