చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు తెలిపిన పట్టాభి
- రెండో విడత నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన కూటమి ప్రభుత్వం
- స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ గా పట్టాభి
- టీడీపీ గళాన్ని గట్టిగా వినిపించినందుకు తగిన గుర్తింపు
కూటమి ప్రభుత్వం రెండో విడత ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు సందర్భాల్లో పట్టాభి టీడీపీ గొంతుకను గట్టిగా వినిపించారు. అనేక దాడులను కూడా ఆయన ఎదుర్కొన్నారు.
వెనుకంజ వేయకుండా పోరాడినందుకే పట్టాభికి పదవి ఇచ్చినట్టు టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. దీనిపై పట్టాభి స్పందించారు.
"కొన్ని నెలల క్రితం వరకు రాష్ట్ర రాజకీయ మైదానంలో ఉన్న చెత్తను శుభ్రం చేసే పనిలో ఉన్న నాకు... ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశాక నేడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చారు. తద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి పట్టణాన్ని, ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే కీలక బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అంటూ పట్టాభి ట్వీట్ చేశారు.
ఈ మేరకు చంద్రబాబు, లోకేశ్ లతో కలిసున్న ఫొటోలను కూడా పంచుకున్నారు.