రష్యా రాజధాని మాస్కోపై 34 డ్రోన్లతో దాడి చేసిన ఉక్రెయిన్
- 2022లో యుద్ధం ఆరంభమయ్యాక మాస్కోపై ఇదే అతిపెద్ద దాడి
- అన్ని డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించిన రష్యా సైన్యం
- రష్యా తమపై 145 డ్రోన్లతో దాడి చేసిందన్న ఉక్రెయిన్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో గత కొన్నిరోజులుగా ఇరు దేశాలు పరస్పరం డ్రోన్ల దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా, ఉక్రెయిన్ ఏకంగా 34 డ్రోన్లతో రష్యా రాజధాని మాస్కో నగరంపై దాడి చేసింది.
అయితే, ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామని రష్యా సైన్యం ప్రకటించింది. మాస్కో దిశగా వస్తున్న 34 డ్రోన్లను కూల్చివేశామని, ఇతర ప్రాంతాల్లో మరో 36 డ్రోన్లను కూల్చివేశామని వెల్లడించింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో, మాస్కో నగరంలోని మూడు ఎయిర్ పోర్టులకు వచ్చే విమానాలను దారి మళ్లించారు.
2022లో యుద్ధం మొదలయ్యాక రష్యా రాజధానిపై ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో ఇదే పెద్దది. కాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ స్పందిస్తూ... రష్యా ఇటీవల తమ దేశంపై 145 డ్రోన్లతో దాడి చేసిందని ఆరోపించారు.