'దేవర' 43 రోజుల వరల్డ్‌వైడ్‌ బాక్సాఫీస్‌ కలెక్షన్లు ఎంతో తెలుసా?

  • సెప్టెంబరు 27న విడుదలైన 'దేవర' 
  • 43 రోజుల్లో రూ. 292.71 కోట్ల షేర్‌ వసూలు 
  • ప్రాఫిటబుల్‌ వెంచర్‌గా 'దేవర'
ఎన్టీఆర్‌, కొరటాల శివ కలయికలో రూపొందిన చిత్రం 'దేవర'. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌, శ్రీకాంత్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. పాన్‌ ఇండియా చిత్రంగా సెప్టెంబరు 27న విడుదలైన ఈ చిత్రానికి  మొదట్లో మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. 

అయితే దేవర, వరగా ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయంలో తన నటనతో మెప్పించడంతో  సినిమాకు ఆదరణ పెరిగింది. ముఖ్యంగా ఈ చిత్రానికి దసరా సెలవులు అడ్వాంటేజీగా నిలిచాయి. దీంతో 'దేవర' ఎన్టీఆర్‌ హిట్‌ ఖాతాలో చేరింది. ఇప్పటి వరకు 2024లో విడుదలైన చిత్రాల్లో 'కల్కి' తరువాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా దేవర నిలిచింది. 

కాగా నవంబరు 8 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. కాగా  ఈ చిత్రం విడుదలైన రోజు నుంచి 43 రోజుల వరకు అన్ని భాషల్లో  ప్రపంచవ్యాప్తంగా రూ. 292 కోట్ల 71 లక్షల షేర్‌ను సాధించిందని ట్రేడ్‌ వర్గాల సమాచారం. నార్త్‌ అమెరికాలో 976 లోకేషన్స్‌ల్లో రూ. 51 కోట్లకు పైగా బాక్సాఫీస్‌ వసూళ్లను సాధించిందని తెలిసింది. 

అత్యంత భారీ వ్యయంతో రూపొందిన 'దేవర' చిత్రం బాక్సాఫీస్‌ వసూళ్లను, ఓటీటీ హక్కులను, ఇతర రైట్స్‌ను కలుపుకుంటే ఫైనాన్షియల్‌గా ప్రాఫిటబుల్‌ వెంచరే అని చెప్పుకోవచ్చు. 


More Telugu News