ట్రంప్ సొంతమైన ఆరిజోనా.. స్వింగ్ స్టేట్స్‌లో క్లీన్ స్వీప్!
- స్వింగ్స్ స్టేట్స్‌ను స్వీప్ చేసిన ట్రంప్
- ఆరిజోనా, నెవడాలోనూ జయకేతనం
- 312 ఎలక్టోరల్ ఓట్లతో ట్రంప్ తిరుగులేని విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పూర్తిగా వచ్చేశాయి. వివిధ కారణాలతో లెక్కింపు ఆలస్యమైన ఆరిజోనా, నెవడా ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ట్రంప్ జయకేతనం ఎగురవేశారు. ఈ విజయంతో స్వింగ్ స్టేట్స్ ఏడింటినీ ట్రంప్ స్వీప్ చేసినట్టు అయింది. ఆరిజోనాను సొంతం చేసుకున్న ట్రంప్ ఖాతాలో మరో 11 ఎలక్టోరల్ ఓట్లు పడ్డాయి. ఫలితంగా ట్రంప్ దక్కించుకున్న ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 312కు పెరిగింది. ఆయన ప్రత్యర్థి కమలా హారిస్ 226 ఎలక్టోరల్ ఓట్లకు పరిమితమయ్యారు.
దేశంలోని 50 రాష్ట్రాల్లో సగానికిపైగా రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించినట్టు అమెరికా మీడియా తెలిపింది. వీటిలో జార్జియా, పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సన్ వంటి స్వింగ్ స్టేట్స్ కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రాలన్నీ గతంలో జో బైడెన్ పక్షాన నిలిచాయి. కాగా, బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలైన నార్త్ కరోలినా, నెవడాలోనూ ట్రంప్ జయకేతనం ఎగురవేశారు.