వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై అట్రాసిటీ కేసు

  • సింహాద్రిపురానికి చెందిన హరి ఫిర్యాదుతో కేసు నమోదు
  • వైసీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్న అర్జున్‌రెడ్డి, వర్రా రవీందర్‌రెడ్డిపైనా నాన్ బెయిలబుల్ కేసులు
  • పోస్టులపై ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించారన్న హరి 
వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై కడప జిల్లా పులివెందులలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. సింహాద్రిపురం మండలానికి చెందిన హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవరెడ్డితోపాటు వైసీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్న అర్జున్‌రెడ్డి, పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న వర్రా రవీందర్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పులివెందుల పట్టణ పోలీసులు తెలిపారు. 

జగన్‌ను విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో గత ఐదేళ్లుగా రవీందర్‌రెడ్డి పోస్టులు పెడుతున్నాడని, దీనిని ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించాడంటూ హరి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఆయన ఫిర్యాదుతో ముగ్గురిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News