హైడ్రా నోటీసులు అంటూ ప్రచారం... కమిషనర్ రంగనాథ్ స్పందన
- హైదరాబాద్ లో హైడ్రా నోటీసుల కలకలం
- ఫిర్యాదుపై క్షేత్ర స్థాయిలో విచారణ చేస్తున్న అధికారుల బృందం
- తప్పుడు ప్రచారం అంటూ ఖండించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
కొన్ని రోజుల క్రితం అమీన్‌పూర్ కృష్ణారెడ్డిపేటలో ఒక సర్వే నంబర్ చూపించి మరో సర్వే నంబర్ భూమి అమ్మకంపై వచ్చిన ఫిర్యాదుపై హైడ్రా బృందం స్పందించి సర్వే అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టింది. అయితే దీనిపై ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రా మళ్లీ దృష్టి పెట్టిందనీ, 50 మందికి నోటీసులు ఇచ్చారనీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేతకు నోటీసులు ఇచ్చింది. పదిహేను రోజుల గడువు అంటూ పుకార్లు షికారు చేశాయి. దీంతో కలకలం రేగింది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అదంతా తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు. భూమి అమ్మకంపై వచ్చిన ఫిర్యాదుకు స్పందించి తమ సర్వే బృందం విచారణ చేపట్టిందని అంతే కానీ ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని వివరణ ఇచ్చారు.