ఇండియాలోని ఏడు మేజర్ సిటీస్‌లో 'పుష్ప-2 ది రూల్' ఈవెంట్స్ ఖరారు
- ప్రమోషనల్ టూర్ విశేషాలను ప్రకటించిన మేకర్స్
- ఏడు ప్రధాన నగరాల్లో 'ఫుష్ప-2' ప్రమోషన్
- పాట్నాలో తొలి ఈవెంట్‌తో శ్రీకారం
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప-2 ది రూల్'. ట్రేడ్ వర్గాలు ఇండియన్ ఫిల్మ్‌గా అభివర్ణిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. 'పుష్ప ది రైజ్' సాధించిన సంచలన విజయమే ఇందుకు కారణం. ప్రస్తుతం 'పుష్ప-2' చిత్రం ఒకవైపు చివరి దశ చిత్రీకరణతో పాటు నిర్మాణనంతర పనులను కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయడానికి నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. కాగా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్ షెడ్యూల్‌ను నిర్మాతలు ఖరారు చేశారు.
ఇండియాలోని ఏడు మేజర్ సిటీస్‌లో మాస్ ఈవెంట్స్‌ను నిర్వహించబోతున్నట్లుగా మేకర్స్ అఫీషియల్‌గా విడుదల చేసిన ఓ వీడియో ద్వారా తెలియజేశారు. పాట్నా, కోల్ కతా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో ఈ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీలీల, అల్లు అర్జున్‌లపై ప్రత్యేక గీతం చిత్రీకరిస్తున్నారు.
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు