మోదీ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నేతలు ఖండించారా?: పొన్నం ప్రభాకర్
- కులగణనకు బీజేపీ అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలని నిలదీత
- సామాజిక మార్పు కోసమే కులగణన చేపడుతున్నట్లు వెల్లడి
- కులగణనపై బీజేపీ నేతల వ్యాఖ్యలు గమనించాలని వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను ఇక్కడి బీజేపీ నేతలు ఒక్కసారైనా ఖండించారా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కులగణనపై ఆయన మాట్లాడుతూ... కులగణనకు బీజేపీ అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలన్నారు. సామాజిక మార్పు తీసుకు రావడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వే చేపడుతోందని స్పష్టం చేశారు. ఈ సర్వే ద్వారా ప్రభుత్వం సేకరిస్తున్న సమాచారం గోప్యంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
బీజేపీ... బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. కులగణనపై బీజేపీ నేతల వ్యాఖ్యల పట్ల బలహీనవర్గాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోజనం కోసమే కులగణన చేపడుతున్నట్లు బీజేపీ నేత లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
ఇప్పుడు ఏ ఎన్నికలు ఉన్నాయో చెప్పాలని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఉండాలా? వద్దా? చెప్పాలని నిలదీశారు. ఐఐటీ, ఐఐఎం లాంటి ఉన్నత విద్యాసంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు.