రైతులకు ధైర్యం చెప్పిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- రైతులు అధైర్యపడవద్దన్న మంత్రి
- పంటలకు మద్దతు ధర ఇస్తామని హామీ
- డిసెంబరు నెలాఖరులోగా పెండింగ్ రుణమాఫీ చేస్తామని వెల్లడి
మద్దతు ధరపై తెలంగాణ రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధైర్యం చెప్పారు. రైతులు అధైర్యపడవద్దని.. పంటలకు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... డిసెంబరు నెలాఖరులోగా పెండింగ్‌లో ఉన్న రూ.13 వేల కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు.
రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని వెల్లడించారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. డిసెంబరులో గ్రూప్ 1 అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.