దూసుకుపోతున్న మలయాళ మూవీ 'మురా'... కథ ఇదే!
- మలయాళంలో రూపొందిన 'మురా'
- నిన్ననే విడుదలైన సినిమా
- నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ
- మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్న కంటెంట్
మలయాళంలో ఈ శుక్రవారం విడుదలైన సినిమాలలో 'మురా' ఒకటి. విడుదలకు ముందే అక్కడ మంచి బజ్ ను సంపాదించుకుంది. టీజర్... ట్రైలర్ తో అందరిలో ఉత్కంఠను పెంచింది. సూరజ్ వెంజరమూడు కీలక పాత్రను పోషించిన ఈ సినిమాలో, హృదు హరన్, యదు కృష్ణ, అనుజిత్, జాబిన్ దాస్ ప్రధానమైన పాత్రలను పోషించారు. మహ్మద్ ముస్తఫా దర్శకత్వం వహించిన సినిమా ఇది.
హెచ్ ఆర్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, క్రిస్టీ జోబీ సంగీతాన్ని సమకూర్చాడు. నిన్ననే ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి ఈ సినిమాకి అనూహ్యమైన స్పందన వస్తున్నట్టుగా తెలుస్తోంది. దర్శకుడు ఎంచుకున్న కథ... పాత్రలను మలిచిన విధానం... ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయని అంటున్నారు. ఇప్పుడు అక్కడ ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు.
ఈ కథ సహజత్వానికి దగ్గరగా... సందేశాన్ని ఇచ్చేదిగా, తిరువనంతపురం నేపథ్యంలో కొనసాగుతుంది. ఆనంద్, మనూ, మనఫ్, షాజీ అనే నలుగురు యువకులు మంచి స్నేహితులు. నిరుద్యోగం వారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాంతో వాళ్లు ఓ గ్యాంగ్ స్టర్ ను ఆశ్రయిస్తారు. అతను వాళ్లకు 'మధురై'లో చేయవలసిన ఒక ప్రమాదకరమైన పనిని అప్పగిస్తాడు. అదేమిటి? ఆ యువకులకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనేది 'మురా' కథ.