అస్వస్థతకు గురై ఆసుపత్రిలో ఉన్న కౌశిక్ రెడ్డి బాధ్యత ప్రభుత్వానిదే: హరీశ్ రావు
- దళితబంధు నిధులు విడుదల చేయాలంటూ పాడి కౌశిక్ రెడ్డి ధర్నా
- పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
- దళితబంధు అడిగితే దాడి చేస్తారా? అని కేటీఆర్, హరీశ్ రావు ఆగ్రహం
హుజూరాబాద్ చౌరస్తాలో అంబేడ్కర్ సాక్షిగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన పోలీసుల దాడిని ఖండిస్తున్నానని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం చెల్లించాలని కోరడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? ఇది ప్రజాపాలన కాదు... రేవంత్ మార్క్ రాక్షస పాలన... కాంగ్రెస్ మార్క్ నిరంకుశ పాలన... ఇందిరమ్మ ఎమర్జెన్సీ నాటి నిర్బంధ పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ ఎమ్మెల్యే ఆరోగ్యం, భద్రత పట్ల పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను , కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
మరోవైపు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు ఫోన్ చేశారు. ఘటన జరిగిన తీరు, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
దళితబంధు అడిగితే దాడి చేస్తారా?: కేటీఆర్
దళితబంధు అడిగితే ఎమ్మెల్యేపై దాడి చేస్తారా? అని కేటీఆర్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని నిలదీశారు. పోలీసులు ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకే పని చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక పోలీసులకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
కౌశిక్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నారని విమర్శించారు. అందుకే గతంలో అరికెపూడి గాంధీతో దాడి చేయించే ప్రయత్నం చేశారన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న ఎమ్మెల్యేపై సీఎం దాడి చేయించాడని ధ్వజమెత్తారు. ఇంతటి పిరికి ప్రభుత్వాన్ని తాము ఎప్పుడూ చూడలేదన్నారు. కౌశిక్ రెడ్డిపై దాడిని ఆయన ఖండించారు.
ఏం జరిగింది?
దళితబందు రెండో విడత నిధులు విడుదల చేయాలంటూ కౌశిక్ రెడ్డి హుజూరాబాద్‌లో ధర్నా చేశారు. దళిత కుటుంబాలతో కలిసి ఆయన ధర్నాకు దిగడంతో... పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇది ఉద్రిక్తంగా మారింది. ఓ దళిత మహిళ స్వల్పంగా గాయపడింది. హుజూరాబాద్ చౌరస్తాలో ధర్నా చేయడంతో వరంగల్-కరీంనగర్ హైవేపై వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని కౌశిక్ రెడ్డి చెప్పడంతో పోలీసులు అతనిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని ధర్నా చేస్తుంటే పోలీసులు తనతో పాటు, ధర్నా చేస్తున్న వారిని తీవ్రంగా కొట్టారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.