లక్నో బయల్దేరిన రామ్ చరణ్

లక్నో బయల్దేరిన రామ్ చరణ్
  • రామ్ చరణ్, శంకర్ కాంబోలో గేమ్ చేంజర్
  • నేడు లక్నోలో టీజర్ రిలీజ్ ఈవెంట్
  • హాజరుకానున్న రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. ఆయన లక్నో వెళుతుండగా మీడియా కెమెరాలు క్లిక్ మనిపించాయి. నేడు (నవంబరు 9) గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ కార్యక్రమం లక్నోలో జరగనుంది. ఈ కార్యక్రమం కోసం రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. 

రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన మాలధారణ చేసి ఉండడంతో, నల్ల దుస్తుల్లో, కాళ్లకు చెప్పుల్లేకుండా కనిపించారు. 

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇవాళ విడుదలయ్యే టీజర్ తో ఆ అంచనాలు మరింత పెరగనున్నాయి. నిన్ననే టీజర్ ప్రోమో రిలీజ్ కావడంతో, అభిమానులు టీజర్ కోసం తహతహలాడుతున్నారు.


More Telugu News