ప్రభాస్ లుక్ లీక్.. 'కన్నప్ప' టీమ్ నుంచి విజ్ఞప్తి
- మంచు విష్ణు, ముకేశ్ కుమార్ సింగ్ కాంబోలో కన్నప్ప
- ఇతర కీలక పాత్రల్లో భారీ తారాగణం
- తాజాగా మూవీ నుంచి లీకైన ప్రభాస్ లుక్
- ఆ ఫోటోను లీక్ చేసిన వారిని కనిపెడితే.. రూ.5లక్షలు బహుమానం ఇస్తామంటూ ప్రకటన
మంచు విష్ణు, ముకేశ్ కుమార్ సింగ్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో మోహన్ లాల్, మోహన్ బాబు, శివరాజ్ కుమార్, ప్రభాస్, నయనతారతో పాటు పలువురు స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షుటింగ్ దశలో ఉంది. అయితే, ఈ చిత్రం నుంచి తాజాగా ప్రభాస్ లుక్ లీకైంది. దీనిపై చిత్ర బృందం స్పందించింది. ఆ ఫొటోను లీక్ చేసిన వారిని కనిపెడితే.. రూ.5లక్షలు బహుమానం ఇస్తామని పేర్కొంది.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేసింది. "ప్రభాస్ అభిమానులతో పాటు, మిగిలిన హీరోల ఫ్యాన్స్‌ను కోరుతుంది ఏమంటే.. కన్నప్ప కోసం గత ఎనిమిదేళ్లుగా మేము మా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నాం. రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ‘కన్నప్ప’ నుంచి ఓ ఫొటో అనధికారికంగా లీక్ అయినందుకు చాలా బాధపడుతున్నాం.
ఈ లీక్ మా కష్టాన్ని మాత్రమే కాకుండా, ఈ ప్రాజెక్ట్ కోసం నిరంతరం కృషి చేస్తున్న రెండు వేల మంది వీఎఫ్‌ఎక్స్ కళాకారుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ ఫొటో లీక్ ఎలా జరిగింది అనేది కనుగొనేందుకు మేము పోలీస్ కేసు పెడుతున్నాం. దయచేసి ఈ ఫొటోను ఎవరూ షేర్ చేయొద్దని మనవి.
దీన్ని షేర్ చేసిన వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఫొటోను లీక్ చేసిన వ్యక్తిని కనిపెట్టినవారికి రూ.5 లక్షలు బహుమానంగా ఇస్తాం. మీకు సమాచారం తెలిసిన వెంటనే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాకు నేరుగా మెసేజ్ పంపండి. ఈ సినిమా స్ఫూర్తిని కాపాడటంలో మాతో చేతులు కలపండి. మీరందరూ మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం" అని లేఖలో పేర్కొంది.