షవర్మా తిన్న కస్టమర్లకు అస్వస్థత... గ్రిల్ హౌస్ రెస్టారెంట్ లో మరోసారి ఫుడ్ పాయిజనింగ్

  • పదిహేను రోజుల క్రితం సీజ్.. మూడు రోజుల క్రితమే తెరిచిన యాజమాన్యం
  • వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరిన బాధితులు
  • వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు
పదిహేను రోజుల క్రితమే ఫుడ్ పాయిజనింగ్ కారణంగా మూతపడిందా రెస్టారెంట్...! అన్నీ సర్దుకుని, మార్పులు చేర్పులు చేశాక మూడు రోజుల కిందటే యాజమాన్యం మళ్లీ తెరిచింది. అక్కడ షవర్మా బాగుంటుందనే పేరుండడంతో జనం మళ్లీ ఎగబడ్డారు. ఇటీవలే ఫుడ్ పాయిజనింగ్ జరిగిందన్న విషయం తెలిసీ ఆ రెస్టారెంట్ కు క్యూ కట్టారు. తాజాగా మరోసారి అదే రెస్టారెంట్ లో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. షవర్మా తిన్న నలుగురు కస్టమర్లు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలయ్యారు.

హైదరాబాద్ లోని గ్రిల్ హౌస్ రెస్టారెంట్ లో చోటుచేసుకుందీ ఘటన. ఆసుపత్రిలో చేరిన నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పదిహేను రోజుల్లో రెండుసార్లు ఫుడ్ పాయిజనింగ్ జరగడంపై స్థానికులు సదరు రెస్టారెంట్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. గ్రిల్ హౌస్ రెస్టారెంట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ తెరిచే అవకాశం లేకుండా రెస్టారెంట్ ను మూసేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.


More Telugu News