భవిష్యత్తులో ఇజాలన్నీ పోయి టూరిజం ఒక్కటే ఉంటుంది: చంద్రబాబు
- పున్నమి ఘాట్-శ్రీశైలం మధ్య సీప్లేన్ సర్వీసును ప్రారంభించనున్న చంద్రబాబు
- అనంతరం కేంద్రమంత్రులతో కలిసి ప్రయాణం
- రాష్ట్రంలో ధ్వంసమైన వ్యవస్థలను గాడినపెడుతున్నట్టు చెప్పిన సీఎం
భవిష్యత్తులో ఇక ఏ ఇజమూ ఉండదని, టూరిజం ఒక్కటే ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్- శ్రీశైలం మధ్య సీప్లేన్ సర్వీసును చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, పలువురు కేంద్రమంత్రులతో కలిసి అందులో ప్రయాణిస్తారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో విమానాశ్రయాల్లోనే కాకుండా సీ ప్లేన్ ద్వారా కూడా రవాణా సౌకర్యం లభిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ధ్వంసమైన వ్యవస్థలను బాగుచేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. గాడి తప్పిన పాలనను సరిచేయడమే తన లక్ష్యమన్నారు. పోగొట్టిన బ్రాండ్ ఇమేజ్‌ను తిరిగి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నట్టు వివరించారు.
ప్రజలు గెలవాలని తాను, పవన్, మోదీ కోరామని, అనుకున్నట్టుగానే ఏపీ ప్రజలు గెలిచి రాష్ట్రాన్ని నిలబెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రజలు ఆక్సిజన్ ఇచ్చారని చెప్పారు. నాడు ఐటీ అంటే అందరూ ఎగతాళి చేశారని, ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల చూసినా మన వాళ్లే ఉన్నారని చెప్పుకొచ్చారు.