వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ ఇంటికి పోలీసులు ..ఎందుకంటే..!
- వర్రా రవీందర్ రెడ్డి కేసులో అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు
- రాఘవరెడ్డి ఇంట్లో లేకపోవడంతో వెళ్లిపోయిన పోలీసులు
- నిందితుడు రవీందర్ రెడ్డితో రాఘవరెడ్డి మాట్లాడినట్లు అనుమానిస్తున్న పోలీసులు
వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు చేరుకోవడం పులివెందులలో హాట్ టాపిక్ అయింది. అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పరారీలో ఉన్న వర్రా రవీందర్ రెడ్డి మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో వర్రా రవీందర్ రెడ్డి కేసు విచారణ నిమిత్తం పోలీసులు రాఘవరెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకే పోలీసులు వచ్చారన్న సమాచారంతో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు రాఘవరెడ్డి నివాసానికి చేరుకున్నారు.
అయితే పోలీసులు వెళ్లిన సమయంలో రాఘవరెడ్డి ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు చెప్పడంతో వారు వెనుదిరిగారు. మరోపక్క ఈ విషయంపై పులివెందుల అర్బన్ సీఐ జీవన్ రంగనాథ్ తో న్యాయవాది ఓబులరెడ్డి మాట్లాడారు. ఇక గత వైసీపీ హయాంలో వర్రా రవీందర్ రెడ్డి ఇష్టానురీతిలో వ్యవహరించారన్న అభియోగాలు ఉన్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, వంగలపూడి అనితపై అసభ్యకరమైన రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఆయనపై మంగళగిరి, తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయాయి.
రెండు రోజుల క్రితం స్థానిక పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని 41ఏ నోటీసు ఇచ్చి పంపడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో రవీందర్ రెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే రవీందర్ రెడ్డి కోసం ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు.