ట్రంప్ ఇంటి చుట్టూ రోబో డాగ్స్ పహారా.. వీడియో ఇదిగో!

ట్రంప్ ఇంటి చుట్టూ రోబో డాగ్స్ పహారా.. వీడియో ఇదిగో!
  • అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ కు కట్టుదిట్టమైన భద్రత
  • ఆర్మ్ డ్ బోట్ తో సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం నిఘా
  • ట్రంప్ హత్యకు కుట్ర పన్నిన మరో ముగ్గురి అరెస్ట్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఫ్లోరిడాలోని ఆయన నివాసం మార్ ఏ లాగో చుట్టూ రోబో డాగ్ లతో పహారా ఏర్పాటు చేశారు. నివాసం చుట్టూ ఉన్న సరస్సులో ఆర్మ్ డ్ బోట్ తో సెక్యూరిటీ సిబ్బంది 24 గంటలూ గస్తీ కాస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై హత్యాయత్నం జరగడం, మరో ర్యాలీకి ఆయుధాలతో ఓ ఆగంతుకుడు హాజరుకావడం తెలిసిందే. తాజాగా ట్రంప్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ అధికారులు మరో ముగ్గురు వ్యక్తులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ నివాసం చుట్టూ సెక్యూరిటీ కోసం రోబో డాగ్ లను నియమించారు.

మార్ ఏ లాగో భవనం చుట్టూ రోబో డాగ్ లు పహారా కాస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అచ్చం శునకంలాగా నడుస్తున్న ఈ రోబో డాగ్ కు తల ఉండాల్సిన చోట ఓ ఆయుధం, కెమెరాలతో పాటు పలు సెన్సర్లు ఏర్పాటు చేసినట్లు దాని తయారీదారులు తెలిపారు. బోట్సన్ లోని బోట్సన్ డైనమిక్ కంపెనీ ఈ రోబో సెక్యూరిటీ డాగ్ ను తయారు చేసింది. అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులతో కలిసి ఈ రోబో డాగ్ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. ట్రంప్ ను కలవడానికి వచ్చిన సందర్శకులు ఈ రోబో డాగ్ ల సమీపంలోకి వెళ్లకుండా దాని మెడలో ఓ హెచ్చరిక బోర్డును అధికారులు ఏర్పాటు చేశారు.


More Telugu News