చిత్ర పరిశ్రమలో మనకు మనమే: దిల్ రాజు
- ‘క’ మూవీ సక్సెస్ మీట్‌లో నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు
- సినీ ఇండస్ట్రీలో ఎవరూ ఎవరికీ సాయం చేయరు, మనల్ని మనమే నిరూపించుకోవాలని సూచన
- సినీ ఫీల్డ్‌లో ప్రతిభకే పెద్ద పీటని దిల్ రాజు వ్యాఖ్యలు
చిత్ర పరిశ్రమలో ఎవరూ ఎవరికీ సాయం చేయరు. మనల్ని మనమే నిరూపించుకోవాలంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటింటిన ‘క’ మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలలో ఎవరికి వారు తమ ప్రతిభను నిరూపించుకోవాలి కానీ ఎవరో ఏదో అన్నారని భయపడకూడదన్నారు. ప్రతిభ ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతారని, ఇక్కడ కేవలం ప్రతిభకే పెద్ద పీట వేస్తారని చెప్పారు.
ఇటీవల కిరణ్ అబ్బవరం చేసిన వ్యాఖ్యలు విన్నానని, అలాగే ఓ హీరో కూడా సెలబ్రిటీలు ఎవరూ తమ చిత్రాన్ని సపోర్టు చేయడానికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఈ వ్యాఖ్యలపై దిల్ రాజు స్పందిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టపడ్డారు కాబట్టే ‘క’ ఇంతటి విజయం సాధించిందన్నారు. ట్రోల్స్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని దిల్‌రాజు హితవు పలికారు.
నీ వద్ద ప్రతిభ ఉంది కాబట్టి ఎప్పుడూ భావోద్వేగానికి గురి కావద్దంటూ కిరణ్‌కు దిల్ రాజు సూచించారు. సినీ ఫీల్డ్‌లో హార్డ్‌వర్కే నిలబెడుతుందని అన్నారు. సెలబ్రిటీలు వచ్చారా ? లేదా? అనేది ముఖ్యం కాదని, సినిమాని ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకువెళ్లాలన్నదే ముఖ్యమని అన్నారు. సినీఫీల్డ్‌లోకి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని హార్డ్‌వర్క్ చేయాలని దిల్ రాజు సూచించారు.
.