రేపు మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

  • రేపు ముంబైలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశం
  • సమావేశానికి హాజరు కానున్న ఏఐసీసీ ముఖ్యనేతలు
  • శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముంబైకి వెళ్లనున్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మహారాష్ట్రకు వెళ్ళనున్నారు. ముంబైలో రేపు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం ఆయన రేపు ఉదయం వెళుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి ముంబై చేరుకుంటారు. 

త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహం, రూపొందించాల్సిన మేనిఫెస్టోపై సలహాలు, ఇతర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో పాటు ఏఐసీసీ అగ్రనేతలు, ముఖ్యనేతలు పాల్గొననున్నారు.


More Telugu News