కారుకు గ్రాండ్‌గా అంత్యక్రియలు... సొంత పొలంలోనే సమాధి... వీడియో ఇదిగో
- కారుతో అదృష్టం కలిసి వచ్చిందనే నమ్మకంతో ఖననం
- భవిష్యత్ తరాలకు గుర్తుండాలనే ఉద్దేశంతో వినూత్న ఆలోచన
- రూ.4 లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా వీడ్కోలు
- గుజరాత్‌లో ఆసక్తికర ఘటన.. వైరల్‌గా మారిన వీడియో
జీవితంలో ఎదుగుదలకు ఉపయోగపడిన వస్తువులపై కూడా కొందరు మమకారం పెంచుకుంటారు. ఏకంగా 12 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు తమ జీవితాల్లో ఒక భాగస్వామిగా ఉన్న ఓ లక్కీ కారు విషయంలో గుజరాత్‌కు చెందిన ఓ రైతు కుటుంబం కూడా అలాగే అమితమైన ప్రేమను పెంచుకుంది. ఈ కారుని కొన్నాకే తమ జీవితాల్లో అదృష్టం కలిసొచ్చిందని వారు నమ్మారు. అందుకే మూలనపడ్డ కారుకు నిన్న (గురువారం) గ్రాండ్‌గా అంత్యక్రియలు నిర్వహించారు. ఏకంగా రూ.4 లక్షలు ఖర్చు పెట్టి ‘సమాధి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. భవిష్యత్ తరాలకు గుర్తుండాలనే ఉద్దేశంతో కారును ఖననం చేశామని వారు చెబుతున్నారు.
కాగా కారు ‘సమాధి’ కార్యక్రమానికి రావాల్సిందిగా గ్రామస్థులు, సాధువులు, మత గురువులను ఆహ్వానించారు. సుమారు 2,000 మందికి నాలుగు పేజీలతో కూడా ఆహ్వాన పత్రికలను పంపించారు. దాదాపు 1,500 మందికిపైగా హాజరయ్యారు. పువ్వులు, దండలతో కారుని అలంకరించి అంతిమయాత్ర నిర్వహించారు. ఊరేగింపుగా తీసుకెళ్లి తమ పొలంలోనే ఖననం చేశారు. ఈ ప్రక్రియను కూడా ఆచార, సంప్రాదాయాలతో నిర్వహించారు.
అమ్రేలి జిల్లా లాఠీ తాలూకాలోని పదర్శింగ గ్రామానికి చెందిన సంజయ్ పోలారా, ఆయన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కారుకు పచ్చని వస్రాన్ని కప్పి, పూజారుల మంత్రోచ్ఛారణలు మధ్య సమాధి కార్యక్రమాన్ని నిర్వహించారు. గొయ్యి తవ్వడానికి, కారుని పూడ్చిపెట్టడానికి ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగించారు. ఏటవాలు మార్గాన్ని ఏర్పాటు చేసి 15 అడుగుల లోతు గొయ్యిలో కారును ఖననం చేశారు. గులాబీ పూరేకులు చల్లుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమాధికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అది ‘వాగన్ ఆర్’.
ఈ కారుతో తన కుటుంబానికి కలిసి వచ్చిందని యజమాని సంజయ్ పోలారా తెలిపారు. కుటుంబానికి అదృష్టాన్ని అందించిన ఈ కారును భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా తాను ఏదైనా విభిన్నంగా చేయాలనుకున్నానని, అందుకే ఈ విధంగా వేడుక నిర్వహించానని తెలిపారు. ‘‘నేను దాదాపు 12 ఏళ్ల క్రితం ఈ కారును కొన్నాను. ఈ కారు కుటుంబానికి సంపదను తెచ్చిపెట్టింది. ఈ కారు ద్వారా వ్యాపారంలో విజయాన్ని చూడటమే కాకుండా మా కుటుంబం గౌరవాన్ని కూడా పొందింది. అందుకే కారుని అమ్మడానికి బదులుగా సమాధి చేశాను’’ అని పోలారా చెప్పారు. ఈ సమాధిపై మొక్కను నాటాలనుకుంటున్నానని, చెట్టు కింద 'కుటుంబానికి కలిసి వచ్చిన కారు' ఉందని భవిష్యత్ తరాలకు తెలియాలని అన్నారు. కాగా పోలారాకు కన్‌స్ట్రక్షన్ బిజినెస్ కూడా ఉంది.