రేవంత్ రెడ్డిని ఫొటో తీస్తూ మూసీలోకి జారిపడిన ఫొటోగ్రాఫర్... వీడియో ఇదిగో!
- యాత్రకు ముందు సంగెం వద్ద మూసీ వద్దకు వెళ్లిన సీఎం
- మూసీ వద్దకు వెళ్లి ఫొటో తీసేందుకు ప్రయత్నించిన ఫొటోగ్రాఫర్
- పైకి లేవడానికి ఫొటోగ్రాఫర్‌కు సాయం చేసిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫొటో తీస్తూ ఓ ఫొటోగ్రాఫర్ కాలుజారి మూసీ నదిలో పడిపోయాడు. మూసీ పునరుద్ధరణ యాత్ర ప్రారంభించడానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి సంగెం శివయ్యకు పూజలు చేశారు. ఆ తర్వాత మూసీ నది వద్దకు వెళ్లి ఓ బాటిల్‌లో నీటిని తీసుకున్నారు.
ఈ సమయంలో ఓ ఫొటో జర్నలిస్టు కాస్త ముందుకు వచ్చి సీఎంను ఫొటో తీసేందుకు ప్రయత్నించాడు. కానీ కాలు జారి మూసీ నదిలో పడిపోయాడు. ఆ పక్కనున్న వారు అతనిని పట్టుకున్నారు. సీఎం సెక్యూరిటీలోని ఓ పోలీస్ అధికారి కూడా ఆయనకు సాయం చేశారు.
కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం వద్ద ప్రారంభమైన యాత్రకు రైతులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ యాత్ర భీమలింగం వరకు కొనసాగింది. సీఎంతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.