తినడానికి ఫుడ్డులేని పరిస్థితిని చూశాను: యాంకర్ సౌమ్యారావు

  • 'జబర్దస్త్' స్టేజ్ పై మెరిసిన సౌమ్యారావు
  • తల్లిని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ 
  • ఆ కష్టాలు ఎవరికీ రాకూడదని ఆవేదన 
  • ఇకపై సీరియల్స్ కూడా చేస్తానని వెల్లడి  

'జబర్దస్త్' స్టేజ్ పై చాలామంది యాంకర్స్ సందడి చేశారు. వాళ్లలో కన్నడ బ్యూటీ సౌమ్యారావు ఒకరు. ఒకప్పుడు జబర్దస్త్ వేదికపై మెరిసిన సౌమ్యారావు తాజాగా 'మన మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను పంచుకున్నారు. "మాది బెంగుళూర్... కన్నడ అమ్మాయిని... నాకు తెలుగు అంతగా రాదు. నాకు మా అమ్మగారంటే ఎంతో ఇష్టం. అప్పట్లో ఆమె సంగీతం క్లాసులు చెప్పి నన్ను పెంచారు. ఒకానొక దశలో అన్నానికి కూడా మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము" అని అన్నారు. 

"మా అమ్మగారికి బ్రెయిన్ కేన్సర్ వచ్చింది. ఆ సమయంలో ఆమె కోసం చాలా డబ్బు కావలసి వచ్చింది. ఆ డబ్బు సర్దుబాటు చేయడానికి కూడా ఎన్నో అవస్థలు పడవలసి వచ్చింది. ఆ రోజులను... ఆ కష్టాలను ఎప్పటికీ మరచిపోలేము. అప్పటి నుంచి అమ్మ ఎప్పుడు గుర్తొచ్చినా ఎమోషనల్ అవుతాను. ఎందుకంటే ఆమెను ఎంతో మంచిగా చూసుకోవాలని అనుకున్నాను. 

'జబర్దస్త్' అగ్రిమెంట్ ప్రకారం ఏడాది పాటు యాంకర్ గా చేశాను. ఆ తరువాత మానేయడం జరిగింది. నేను అక్కడ ఉన్నంతవరకూ ఎలాంటి లోటు లేకుండా నన్ను బాగా చూసుకున్నారు. టీమ్ లీడర్స్ తో పాటు, ఎవరితోనూ ఎలాంటి గొడవలు ఉండేవి కాదు. ఒకప్పుడు సీరియల్స్ లో అవకాశాలు వచ్చినా చేయలేదు. కానీ ఇకపై నాకు నచ్చినవి వస్తే చేయాలనే అనుకుంటున్నాను" అని అన్నారు. 



More Telugu News