ఫ్లాట్‌గా ముగిసిన భారత స్టాక్ మార్కెట్

  • 55 పాయింట్ల నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్
  • రియాల్టీ, ఇంధనం, మీడియా రంగాల్లో అమ్మకాల జోరు
  • టాప్ లూజర్స్ లో రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు
భారత స్టాక్ మార్కెట్ ఈరోజు ఫ్లాట్‌గా ముగిసింది. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్ కాసేపటికే నష్టాల్లోకి వెళ్లింది. ఆటో, పీఎస్‌యూ బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీస్, మెటల్, రియాల్టీ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్ 55 పాయింట్లు క్షీణించి 79,486 వద్ద ముగిసింది. నిఫ్టీ 51 పాయింట్లు క్షీణించి 24,148 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ బ్యాంక్ 355 పాయింట్లు నష్టపోయి 51,561 వద్ద ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 757 పాయింట్లు క్షీణించి 56,352 వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీ 318 పాయింట్లు నష్టపోయి 18,445 పాయింట్ల వద్ద స్థిరపడింది.

నిఫ్టీలో రియాల్టీ, ఇంధనం, మీడియా రంగాలు రెండు శాతానికి పైగా పడిపోయాయి. ఆటో, పీఎస్‌యూ బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీస్, మెటల్, ప్రైవేట్ బ్యాంకులు, ఇన్‌ఫ్రా రంగాల్లో అమ్మకాలు జోరుగా కనిపించాయి.

సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, టాటా మోటార్స్, రిలయన్స్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్ నష్టపోగా... మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. బీఎస్ఈలో 1,397 స్టాక్‌లు లాభాల్లో, 2,574 స్టాక్స్ నష్టాల్లో ముగియగా... 93 షేర్లలో ఎలాంటి మార్పులేదు.


More Telugu News