మీకంటే ఉన్మాదులు ఎవరైనా ఉన్నారా?: లక్ష్మీపార్వతి
- సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం
- అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారని ఆరోపణ
- చంద్రబాబు చేసిన పాపాలకేమీ తక్కువలేదని వ్యాఖ్యలు
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందంటూ ఆ పార్టీ మహిళా నేత లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. సోషల్ మీడియా కార్యకర్తలను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు చేసిన పాపాలకేమీ తక్కువలేదని, అలాంటి వ్యక్తి ఇవాళ వైసీపీని ఉన్మాదుల కర్మాగారం అంటున్నాడని లక్ష్మీపార్వతి తెలిపారు.
"మీకంటే ఉన్మాదులు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి 1993 నుంచి చూసుకుందాం... ఆ రోజు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నన్ను బూచిగా చూపారు. లక్ష్మీపార్వతి ఓ రాజ్యాంగేతర శక్తి అని ప్రచారం చేశారు. లక్ష్మీపార్వతి కారణంగానే ప్రభుత్వాన్ని మేం స్వాధీనం చేసుకున్నామని మొత్తం నామీదే నిందలు మోపారు.
ఆ రోజున 75 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ ను ఎంతో క్షోభకు గురిచేసి, ఆయనను పరలోకానికి పంపించావు. మీకు తోడు ఈనాడు పత్రిక. పిచ్చి పరాకాష్ఠకు చేరిందో, అంతకుమించిన స్థాయికి చేరిందో కానీ... అప్పటినుంచి సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని మీరిద్దరూ ఆడుతున్న నాటకాన్ని, మీ దుర్మార్గమైన చర్యలను ఎప్పటికప్పుడు అడ్డుకోవడానికి ఎవరో ఒకరం వస్తూనే ఉన్నాం. అయినప్పటికీ మీలో మార్పేమీ లేదు.
ఈ ప్రపంచంలో ఎవరైనా మారతారేమో కానీ... చంద్రబాబు, ఈనాడు వంటి పనికిమాలినవాళ్లు ఎప్పటికీ మారరు. ఈనాడును చెత్తబుట్టలో వేయాలని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు. అలాంటి, చెత్తబుట్టలో వేయాల్సిన పేపర్ ను అడ్డుపెట్టుకుని ఈ రోజు మీరు ఆడుతున్న నాటకాలు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఇప్పుడు రామోజీ లేకపోయినా ఆయన కొడుకు తయారయ్యాడు. జగన్ ప్రభుత్వంలో మార్గదర్శిపై కేసు వేస్తే, ఈ ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుంది. ఈ కేసులో మేం పాలుపంచుకోవడంలేదని చెప్పింది.
ఆ రోజు ఎన్టీఆర్ గారు, నేను ఎంతో కష్టపడి అధికారాన్ని సాధించుకున్నాం. సోషల్ మీడియా లేని ఆ రోజుల్లో కూడా పేపర్లో నీచమైన రాతలు రాయించారు. ఇంతకంటే ఉన్మాద చర్య ఇంకొకటి ఉంటుందా? ఇవన్నీ మేం అంటున్న మాటలు కాదు... చంద్రబాబు నాకంటే పెద్ద నటుడు అని, అతడికి రామోజీ తోడయ్యాడు... ఇద్దరూ కలిసి ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తున్నారు అని ఆ రోజున ఎన్టీఆర్ కూడా అన్నారు.
ఎన్టీఆర్ గారు నిన్ను తిట్టని తిట్టు లేదు. ఆడియోలు, వీడియోలతోనూ తిట్టారు. దాన్ని బట్టే నువ్వెలాంటి వాడివో అర్థమవుతుంది" అంటూ లక్ష్మీపార్వతి సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు.