రేవంత్ రెడ్డి గారూ... మిమ్మల్ని జైలుకు పంపిన విషయం మరిచిపోయారా?: బండి సంజయ్
- రేవంత్ రెడ్డి, తాను ఒక్కటేనని కేటీఆర్ అంటున్నారన్న బండి సంజయ్
- కానీ రేవంత్, కేటీఆర్ మధ్యనే ఒప్పందం కుదిరిందని వ్యాఖ్య
- బీఆర్ఎస్ పై తామిద్దరం కొట్లాడాం కాబట్టే కేటీఆర్ కు కలలోకి వస్తున్నామని వ్యాఖ్యలు
- రేవంత్ రెడ్డితో కలిసిపోయాడు కాబట్టే కేటీఆర్‌ను అరెస్ట్ చేయలేదని ఆరోపణ
రేవంత్ రెడ్డి గారూ... మిమ్మల్ని కేసీఆర్ జైలుకు పంపిన విషయం మరిచిపోయారా? అయినా రేవంత్, కేటీఆర్ మధ్య ఒప్పందం కుదిరింది... అందుకే కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం లేదని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తాను, రేవంత్ ఒక్కటేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని, కానీ తామిద్దరం ఒక్కటే అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చెప్పాలని ప్రశ్నించారు.
కన్నబిడ్డ పెళ్లికి కూడా వెళ్లకుండా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించారు. జైలుకు పంపిన విషయం రేవంత్ మరిచిపోయారేమో... అలాంటి వారితో కాంప్రమైజ్ అవుతున్నారా? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసులపై కాంగ్రెస్ నేతలు హంగామా చేశారని, కానీ ఇప్పుడు వారి మధ్య ఒప్పందం కుదరడం వల్లే అరెస్ట్ చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటుంటే కేటీఆర్ యాక్టింగ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
తాను, రేవంత్ రెడ్డి ఒక్కటేనని కేటీఆర్ పదేపదే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తామిద్దరం గట్టిగా కొట్లాడామని... అందుకే కేటీఆర్‌కు మేం కలలోకి వస్తున్నామని వ్యాఖ్యానించారు. డైవర్షన్, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసే అలవాటు కేటీఆర్‌కే ఉందన్నారు. తెలంగాణలో బీజేపీకి చోటు లేకుండా చేయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని... కానీ ప్రజలు తమ వెంట ఉన్నారన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే దొరకడం లేదని విమర్శించారు. ప్రధానిని కూడా కేటీఆర్ ఏకవచనంతో విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జన్వాడ ఫాంహౌస్ కేసులో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు.
మూసీ నది పక్కన ఇళ్లు కూల్చేసిన చోట రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఇళ్లు కూల్చి... నల్గొండలో పాదయాత్ర చేయడం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలపై పాదయాత్ర చేయాలని సూచించారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాకుండా ఎన్నికలు వచ్చినప్పుడు బయటకు వస్తే లీడర్ ఎలా అవుతారని బండి సంజయ్ ప్రశ్నించారు.