బ్యాటిల్ ఆఫ్ భాగ్‌పట్: నడిరోడ్డుపై కర్రలతో కుమ్మేసుకున్న మహిళలు.. వీడియో ఇదిగో!
- తరచూ వార్తల్లోకి ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్
- 2021లో లాఠీలతో కుమ్మేసుకున్న చాట్ విక్రయించే గ్రూపులు
- తాజాగా కర్రలతో తలపడిన మహిళలు
చరిత్ర చదువుకున్న వారికి ‘భాగ్‌పట్ యుద్ధం’ గురించి తెలిసే ఉంటుంది. 2021లో చాట్ విక్రయించే రెండు గ్రూపుల మధ్య గొడవతో ‘బ్యాటిల్ ఆఫ్ భాగ్‌పట్’ ఇంటర్నెట్‌లో ఫేమస్ అయింది. తాజాగా, దీనికి కొనసాగింపా? అన్నట్టు మరోమారు అలాంటి ఘటనే జరిగి ‘బ్యాటిల్ ఆఫ్ భాగ్‌పట్’ మరోమారు వైరల్ అవుతోంది. అయితే, ఈసారి తలపడింది మాత్రం మహిళలు.
ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్‌లో కొందరు మహిళలు రెండు వర్గాలుగా విడిపోయి పట్టపగలు, నడిరోడ్డుపై కర్రలతో చితక్కొట్టేసుకున్నారు. వైరల్ అవతున్న వీడియో యాక్షన్ మూవీని తలపిస్తోంది. తొలుత ఇద్దరు మహిళలు మరో మహిళపై కర్రలతో దాడిచేశారు. ఆ వెంటనే వారికి మరికొందరు కలిశారు. ఓ యువతి బాలుడిపైనా ప్రభావం చూపింది. కిందపడిన మహిళ చుట్టూ గుమికూడిన కొందరు మహిళలు కర్రలతో ఆమెను చావబాదారు. ఆ వైపుగా స్కూటర్‌పై వెళుతున్న వ్యక్తి వారిని ప్రశ్నించగా, మర్యాదగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని మహిళలు హెచ్చరించారు.
ఆ వీధిగుండా వెళ్తున్న వారు ఆ గొడవను చూస్తున్నారు తప్పితే ఏమీ చేయలేకపోయారు. ఈ గొడవ ముఖ్యంగా ఇద్దరి మధ్య చెలరేగినట్టు తెలిసింది. ఆ తర్వాత అది పెరిగి పెద్దదై కొట్లాటగా మారింది. చివరికి కొందరు వ్యక్తులు రంగంలోకి దిగి వారిని శాంతపరిచారు. అయితే, ఈ గొడవకు సరైన కారణం మాత్రం తెలియరాలేదు.