కెనడా ఎన్నికలపై ఎలాన్ మస్క్ జోస్యం.. ట్రూడో ఇంటికేనట!
- వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు
- లిబరల్ పార్టీ తరఫున మరోసారి పోటీ చేయనున్న ట్రూడో
- మూడు పార్టీల అభ్యర్థుల నుంచి ట్రూడోకు పోటీ
అయినదానికీ, కానిదానికీ భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరో ఏడాది పాటే పదవిలో ఉంటాడని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. వచ్చే ఏడాది కెనడాలో జరగనున్న ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతారని చెప్పారు. ఎక్స్ (ట్విట్టర్) లో ఓ అభిమాని చేసిన కామెంట్ కు ఆయన ఈ విధంగా జవాబిచ్చారు. ఇటీవలి అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రచారం చేసి మస్క్ ఆయనను గెలిపించిన సంగతి తెలిసిందే. దీనిని గుర్తుచేస్తూ.. ‘ట్రూడోను వదిలించుకోవడానికి మాకు మీ సాయం కావాలి’ అంటూ కెనడా పౌరుడు ఒకరు మస్క్ ను కోరారు. దీనికి స్పందించిన మస్క్.. వచ్చే ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతాడని చెప్పారు.
ప్రస్తుతం కెనడాలో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో ఉంది. వచ్చే ఏడాది అక్టోబర్ 20 లోగా అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. భారత వ్యతిరేక వైఖరితో పాటు ట్రూడో సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలపై ఆ దేశంలో వ్యతిరేకత ఎదురవుతోంది. ట్రూడోపై కెనడా పౌరులు ఆగ్రహంగా ఉన్నారు. అదే సమయంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులు బలం పుంజుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ట్రూడో ప్రాథమికంగా మూడు పార్టీలతో బలమైన పోటీ ఎదుర్కొంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరో రెండు చిన్న పార్టీలు కూడా కెనడా ఎన్నికల బరిలో గట్టి పోటీనిస్తాయని చెప్పారు.