‘కిమ్’ సైన్యంలో చాలామందిని మట్టుబెట్టాం: జెలెన్‌స్కీ

  • రష్యాకు మద్దతుగా తమ సైన్యాన్ని పంపిన నార్త్ కొరియా
  • కుర్స్క్‌లో మోహరించిన 11 వేల మందిలో చాలామందిని చంపేశామన్న జెలెన్‌స్కీ
  • యుద్ధాన్ని ఆపాలంటే ఉక్రెయిన్ దూకుడు తగ్గించి తటస్థంగా ఉండాలన్న పుతిన్
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా పంపిన సైనికుల్లో చాలామందిని హతమార్చినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. తమపై యుద్ధానికి కుర్స్క్‌లో రష్యా  11 వేలమంది నార్త్ కొరియా సైనికులను మోహరించినట్టు జెలెన్‌స్కీ గతంలో ఆరోపించారు. తాజాగా, వారిలో చాలామందిని హతమార్చినట్టు పేర్కొన్నారు. అయితే, ఎంతమంది మరణించారన్న వివరాలను ఆయన వెల్లడించలేదు.

మరోవైపు, రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టాలంటే కీవ్ దూకుడు తగ్గించి తటస్థంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. లేదంటే, ఆ దేశం కొందరు వ్యక్తుల చేతుల్లో చిక్కి రష్యా ప్రయోజనాలకు హాని కలిగించే ఆయుధంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు, యుద్ధాన్ని ముగిస్తే కీవ్‌లో నెలకొన్న దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం చూపాలని కూడా నిర్ణయించుకున్నట్టు పుతిన్ పేర్కొన్నారు.


More Telugu News