ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికా చరిత్రలోనే తొలిసారి మహిళకు కీలక పదవి
- మొట్టమొదటి మహిళా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూసీ వైల్స్
- ఈసారి ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించిన సూసీ
- వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్‌కు నాయకత్వం వహించనున్న మొదటి మహిళగా చరిత్ర
- ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ కూడా ఈ నియామకంపై ఎక్స్ వేదికగా హర్షం
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. తన ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన సూసీ వైల్స్‌ను తన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించారు. దీంతో అగ్రరాజ్యం చరిత్రలోనే తొలిసారి వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్‌కు నాయకత్వం వహించనున్న మొదటి మహిళగా ఆమె నిలవనున్నారు. కాగా, ట్రంప్‌ను ఎన్నికల్లో విజయతీరాలకు చేర్చడంలో ఆమెది కీరోల్. ఎంతో ప్రణాళికాబద్ధంగా ట్రంప్ ప్రచారాన్ని నిర్వహించడంలో సూసీ కీలక పాత్ర పోషించారు.
యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూసీని పొందడం చాలా గౌరవం అని ట్రంప్ అన్నారు. ఇక తన ప్రచారంలో సూసీ పాత్రపై ట్రంప్ మాట్లాడుతూ "అమెరికా చరిత్రలో గొప్ప రాజకీయ విజయాలలో ఒకటి సాధించడానికి ఆమె నాకు సహాయం చేశారు" అని తెలిపారు.
"సూసీ కఠినమైన, తెలివైన, వినూత్న ఆలోచన కలిగిన వ్యక్తి. విశ్వవ్యాప్తంగా గౌరవం, ప్రశంసలు పొందారు" అని ఎన్నికల ప్రచార సమయంలో తన ఎక్స్ (ట్విట్టర్) పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ట్రంప్ తన పరిపాలన బృందం కోసం ప్రకటించిన మొదటి నియామకం ఇదే కావడం విశేషం.
ఇక చీఫ్ ఆఫ్ స్టాఫ్ పోస్టులో ఉన్న వ్యక్తి అధ్యక్షుడికి గేట్ కీపర్‌గా, కాంగ్రెస్, ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలకు అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు.
వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జేడీ వాన్స్ కూడా ఈ నియామకంపై ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. "ఇది గ్రేట్ న్యూస్. ప్రచారంలో సూసీ అధ్యక్షుడు ట్రంప్‌కు ఎంతో సహకరించారు. వైట్‌హౌస్‌లో ఆమె కీలకంగా వ్యవహరిస్తారు" అని అన్నారు.
కాగా, ట్రంప్ మొదటి సారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రిటైర్డ్ ఆర్మీ జనరల్ జాన్ కెల్లీ సహా నలుగురు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌లను నియమించిన విషయం తెలిసిందే. 67 ఏళ్ల సూసీ ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ ప్రచారంలో జూనియర్ హోదాలో షెడ్యూలర్‌గా పనిచేశారు. చాలా మంది రాజకీయ నాయకుల కోసం పని చేసిన అనుభవం ఆమెకు ఉంది. 2016లో ఫ్లోరిడాలో ట్రంప్ ప్రచారాన్ని నిర్వహించడంలోనూ ఆమె సహకరించారు.
2022లో ఆమెను ట్రంప్ తన నిధుల సేకరణ సంస్థ 'సేవ్ అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీ'కి అధిపతిగా నియమించారు. ఆ తర్వాత ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారారు సూసీ.