'గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్ సెంటర్లు.. థియేటర్స్ డీటైల్స్ ఇవిగో!
- ఈ నెల 9న లక్నోలో టీజర్ రిలీజ్
- ఏపీ, తెలంగాణలో 11 సెంటర్స్‌లో టీజర్ రిలీజ్
- 'గేమ్ ఛేంజర్' లో ఐఏఎస్ ఆఫీసర్‌గా చరణ్
రామ్‌చరణ్, శంకర్ కలయికలో రూపొందుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. 'దిల్' రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న చిత్రం విడుదల కానుంది. ఈ నెల 9న లక్నోలో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ, తెలంగాణలోని 11 సెంటర్స్‌లో ఈ టీజర్‌ను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని సుదర్శన్, వైజాగ్-సంగం శరత్, రాజమండ్రి- శివ జ్యోతి, విజయవాడ-శైలజ, కర్నూల్-వి మెగా, నెల్లూర్-ఎస్2 థియేటర్, బెంగళూర్-ఊర్వశి థియేటర్, అనంతపూర్-త్రివేణి, తిరుపతి-పిజీఆర్, ఖమ్మం ఎస్‌వీసీ థియేటర్స్‌ల్లో టీజర్‌ను అభిమానుల సమక్షంలో రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి జరగండి... జరగండి సాంగ్‌తో పాటు 'రా మచ్చా రా... సాంగ్' అనే మరో పాటను విడుదల చేశారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ఎన్నికల నిర్వహణను పరీక్షించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.
అవినీతి రాజకీయ నాయకుల నుంచి దేశాన్ని కాపాడటానికి ఎన్నికల నిర్వహణను నిజాయతీగా ఎలా నిర్వహించాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లను ఎలా పరిష్కరించుకున్నాడు అనేది కథ. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించిన ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్‌ను అందించారు.