అమెరికాలో ట్రంప్ గెలుపు... జనగామలో ఆరడుగుల ట్రంప్ విగ్రహం వద్ద సెలబ్రేషన్స్

  • తెలంగాణలోని జనగామ జిల్లా కొన్నె గ్రామంలో సంబరాలు
  • 2019లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన బుస్సా కృష్ణ
  • ట్రంప్ గెలుపుతో విగ్రహానికి పూలదండ వేసి సంబరాలు చేసిన యువత
అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు 295 ఎలక్టోరల్ ఓట్లు రాగా, కమలాహారిస్‌కు 226 ఓట్లు వచ్చాయి. ట్రంప్ గెలుపొందడంతో ప్రపంచ దేశాధినేతలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. మన దేశంలోనూ కొంతమంది ఆయన గెలుపుతో ఆనందించారు. అయితే తెలంగాణలోని జనగామ జిల్లా కొన్నె గ్రామంలో అయితే ట్రంప్ గెలిచినందుకు భారీ సెలబ్రేషన్సే చేశారు.

కొన్నె గ్రామానికి చెందిన కొంతమంది ట్రంప్ 6 అడుగుల విగ్రహం వద్ద సంబరాలు చేసుకున్నారు. నుదుట విజయ తిలకం దిద్ది... పూలదండ వేసి వేడుకలు చేసుకున్నారు. ఈ విగ్రహాన్ని 2019లో జనగామకు చెందిన బుస్సా కృష్ణ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బుస్సా కృష్ణ మృతి చెందాడు. 2020లో డొనాల్డ్ ట్రంప్ ఓటమిని తట్టుకోలేక గుండెపోటు వచ్చి కృష్ణ చనిపోయినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు.

తాజాగా, ఆ విగ్రహం వద్ద కొంతమంది యువత ట్రంప్ గెలుపు సంబరాలు జరుపుకుంది. ట్రంప్ అభిమాని బుస్సా కృష్ణ తన ఇంటి ఆవరణలో ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ట్రంప్ ఆరోగ్యం బాగుండాలని... మంచి పరిపాలన చేయాలని గతంలో బుస్సా కృష్ణ రక్తాభిషేకం, క్షీరాభిషేకం, జలాభిషేకం చేశాడు.


More Telugu News