విదేశాలకు అక్రమంగా సొమ్ము పంపించారు... వారిని వదిలేది లేదు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- నాటుబాంబు కాదు... త్వరలో ఆటంబాంబే పేలుతుందన్న మంత్రి
- తప్పు చేయని వారు భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
- రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నా పథకాలు అమలు చేస్తున్నామన్న మంత్రి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఆటంబాంబు పేలుతుందన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తప్పు చేసిన వారికి త్వరలో కేవలం నాటు బాంబో... లక్ష్మీ బాంబో కాదు... ఏకంగా ఆటంబాంబు పేలుతుందన్నారు.
కొంతమంది జనం సొమ్మును అక్రమమార్గంలో విదేశాలకు పంపారని విమర్శించారు. అలా తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు. రూ.55 కోట్లు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాయో తేలుస్తామని హెచ్చరించారు. అయితే తప్పు చేయని వారు భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపై రూ.7 లక్షల కోట్ల అప్పును పెట్టి వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ తాము సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొంగులేటి వెల్లడించారు.