మరణశిక్షపై ప్రశ్న... 'ఏఐ' లాయర్ సమాధానంతో ఆశ్చర్యపోయిన సీజేఐ

  • ఢిల్లీలో నేషనల్ జ్యుడిషియల్ మ్యుజియంను ప్రారంభించిన సీజఐ చంద్రచూడ్
  • అక్కడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాయర్‌కు మరణశిక్షపై ప్రశ్న
  • భారత్‌లో మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనని ఏఐ వెల్లడి
మరణశిక్షపై తాను అడిగిన ప్రశ్నకు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) లాయర్ ఇచ్చిన సమాధానంతో సీజేఐ చంద్రచూడ్ ఆశ్చర్యపోయారు. ఈరోజు ఢిల్లీలో నేష‌న‌ల్ జ్యుడిషియ‌ల్ మ్యూజియంను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి 'ఏఐ' లాయర్‌కు సీజేఐ ఓ ప్రశ్నను సంధించారు.

భారత్‌లో మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనా? అని సీజేఐ చంద్రచూడ్ అడిగారు.

కళ్లజోడు, టై, కోటు ధరించి... న్యాయవాది రూపంలో ఉన్న ఏఐ లాయర్ సమాధానం చెబుతూ.... అవును, మన దేశంలో మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది. అత్యంత తీవ్రమైన, చాలా అరుదైన కేసుల్లో మాత్రమే మరణశిక్షను విధిస్తారని పేర్కొంది. ఏఐ లాయర్ సమాధానంతో ఆశ్చర్యపోయిన సీజేఐ, ఓ చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి ముందుకు కదిలారు. ఈ నెల 11న సీజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


More Telugu News