బెంగళూరు కాఫీ షాప్‌లో ప్రత్యక్షమైన బ్రిటన్ మాజీ ప్రధాని, భార్య
- థర్డ్ వేవ్ కాఫీ షాప్‌కు వచ్చిన రిషి సునాక్, అక్షతామూర్తి
- ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపిన బెంగళూరువాసులు
- రాఘవేంద్రస్వామి మఠంలో ప్రత్యేక పూజలు చేసిన మూర్తి కుటుంబం
బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతామూర్తి బెంగళూరులో సందడి చేశారు. నగరంలోని ఓ కాఫీ షాప్‌లో ప్రత్యక్షమయ్యారు. వారితో ఫొటోలు దిగేందుకు అక్కడి వారు ఆసక్తి చూపారు. రిషి సునాక్, అక్షతామూర్తి బెంగళూరులోని థర్డ్ వేవ్ కాఫీ షాప్‌కు వచ్చారు. కాఫీని ఆస్వాదిస్తూ కనిపించారు. రిషి సునాక్ తెల్లని చొక్కా, నల్లటి ప్యాంటు ధరించారు. అక్షతామూర్తి కుర్తా ధరించారు.
బెంగళూరుకు వచ్చిన రిషి సునాక్ జయనగర్‌లోని తన మామ, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి నివాసంలో ఉంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన బెంగళూరులోని రాఘవేంద్రస్వామి మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బెంగళూరుకు వచ్చిన రిషి సునాక్ జయనగర్‌లోని తన మామ, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి నివాసంలో ఉంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన బెంగళూరులోని రాఘవేంద్రస్వామి మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.