రూ.50 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామంటూ షారూక్ ఖాన్‌కు బెదిరింపులు
- బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన షారుక్ ఖాన్
- ఛత్తీస్‌గఢ్ నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లుగా గుర్తించిన పోలీసులు
- బెదిరించిన నిందితుడిని ఫైజాన్ ఖాన్‌గా గుర్తించిన పోలీసులు
బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు ఫోన్ కాల్ బెదిరింపు వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. తనకు బెదిరింపు కాల్ రావడంతో షారూక్ ఖాన్... బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ బెదిరింపు ఫోన్ కాల్ ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చినట్లు దర్యాఫ్తులో వెల్లడైంది.
పోలీసులు షారుక్ ఖాన్‌కు వచ్చిన ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లుగా గుర్తించారు. రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ బెదిరింపులకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అతని కోసం గాలిస్తున్నారు.
పోలీసులు నిందితుడు ఫైజాన్ ఖాన్‌కు ఫోన్ చేసినప్పుడు... తనను హిందుస్థానీ అని పిలవాలని చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. నవంబర్ 5న షారుక్ ఖాన్‌కు ఈ బెదిరింపు కాల్ వచ్చింది. అంతకుముందు, సల్మాన్ ఖాన్‌కు కూడా బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.