షారుఖ్‌కి సారీ చెప్పిన 'సలార్' డైరెక్టర్.. కారణమిదే!
- గతేడాది ఆఖరులో ఒకేసారి విడుదలైన 'డంకీ', 'సలార్' సినిమాలు
- ఈ క్లాష్‌తో 'డంకీ'కి పెద్ద దెబ్బ
- ఇదే విషయమై షారుఖ్ ఖాన్, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీలకు సారీ చెప్పిన ప్రశాంత్ నీల్
'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా లెవెల్‌లో ఫేమస్ అయ్యారు. ఆయన సినిమా వస్తుందంటే మాస్ వర్గం అభిమానులకు పూనకాలే. తన సినిమాల్లో హీరోలకు ఆయన ఇచ్చే ఎలివేషన్స్ వేరే లెవెల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయన సినిమాలకు ప్రత్యేకంగా ఒక వర్గం అభిమానులు ఏర్పడ్డారు.
ఇక ఈ దర్శకుడు తాజాగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కు సారీ చెప్పారు. దీనికి కారణం 'సలార్', 'డంకీ' చిత్రాల మధ్య క్లాష్. గతేడాది ఆఖరులో షారుఖ్ ఖాన్ సినిమా 'డంకీ'తో పాటు ప్రభాస్ 'సలార్' సినిమాలు ఒకేసారి విడుదలైన విషయం తెలిసిందే. ఏడాది ముందే ఆ తేదీని ఫిక్స్ చేసుకున్న బాలీవుడ్ బాద్‌షా 'డంకీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అదే సమయంలో హఠాత్తుగా ప్రశాంత్ నీల్ తన 'సలార్' మూవీని ఈ రేసులోకి దింపాడు. ఈ రెండు చిత్రాలు ఒకేసారి రావడంతో అటు బాక్సాఫీస్ క్లాష్‌తో పాటు ప్రేక్షకులు నార్త్ వర్సెస్ సౌత్‌గా విడిపోయారు. సోలోగా వచ్చి కలెక్షన్లు కొల్లగొడదామనుకున్న 'డంకీ' సినిమాకు 'సలార్' వల్ల చాలా పెద్ద దెబ్బ పడింది.
అప్పటికే 'జవాన్', 'పఠాన్'ల రూపంలో రెండు వెయ్యి కోట్ల మూవీలను తన ఖాతాలో వేసుకున్న షారుఖ్ 'డంకీ'తో మరోసారి ఆ ఫీట్‌ను రిపీట్ చేయాలని చూశారు. కానీ ఊహించని విధంగా ప్రభాస్ 'సలార్'తో రావడం వల్ల 'డంకీ'కి తక్కువ థియేటర్లు దొరికాయి. దాని ప్రభావం సినిమా వసూళ్లపై పడింది.
అయితే, ఈ వివాదంపై తాజాగా ప్రశాంత్ నీల్ స్పందించారు. 'డంకీ' సినిమా విడుదల సమయంలో 'సలార్'ను తీసుకువచ్చి తప్పు చేశామన్నారు. ఈ విషయంలో హీరో షారుఖ్ ఖాన్‌కి, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీకి క్షమాపణలు చెప్పారు. దీంతో ఇప్పటికైనా ఈ వివాదానికి తెర పడిందంటూ సినీ వర్గాలు అంటున్నాయి. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.