రాహుల్ గాంధీకి వేర్పాటువాది యాసిన్ మాలిక్ భార్య లేఖ

  • జమ్ము కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పుతాడన్న ముశాల్ హుస్సేన్ ముల్లిక్
  • యాసిన్ మాలిక్ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని కోరిన ముశాల్
  • యాసిన్ మాలిక్‌కు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి
లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి జమ్ము కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ భార్య ముశాల్ హుస్సేన్ ముల్లిక్ లేఖ రాసింది. తన భర్త జమ్ము కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పుతాడని ఆ లేఖలో పేర్కొంది. కాబట్టి తన భర్తకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది. జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్‌గా ఉన్న మాలిక్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

తన భర్త జైల్లో ఉన్నాడని, ఆయన అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని కోరింది. జమ్ము కశ్మీర్‌లో ఆయన శాంతిని నెలకొల్పుతాడని పేర్కొంది. రాహుల్ గాంధీ గారూ... జమ్ము కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడానికి యాసిన్ మాలిక్ ఒక శక్తిగా మారవచ్చని... అయితే ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, అందుకే ఆయన విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది. తన భర్తను జైల్లో హింసకు గురి చేస్తున్నట్లుగా ఉందని, అతనికి న్యాయం జరిగేలా చూడాలని రాహుల్ గాంధీని కోరింది.


More Telugu News