ఏపీలో విద్యార్థులకు మరో కొత్త పథకం
- పుస్తకాలు, షూ, యూనిఫాంలతో కిట్ల పంపిణీ
- ప్రభుత్వ స్కూళ్లలోని 35 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం
- కేంద్రం వాటా కింద ఏటా 175 కోట్లు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక కిట్ లను పంపిణీ చేయనుంది. విద్యార్థుల కోసం మరో కొత్త స్కీంను తీసుకురానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీనికోసం ఏటా రూ.953.71 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకానికి సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.175.03 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.778.68 కోట్లు ఖర్చు చేసి విద్యార్థులకు కిట్ లు అందజేయనుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదివే 35,94,774 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు.
కిట్ లో ఏముంటాయంటే..
పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, నోటు బుక్స్, బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ, మూడు జతల యూనిఫాంలు
ఒక్కో కిట్ కు ఎంత ఖర్చు..
సగటున ఒక్కో కిట్ కు రూ.1,858 ఖర్చు కానుంది. యూనిఫాం తయారీకి సంబంధించి 8వ తరగతి వరకు రూ.120, తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల యూనిఫాంలకు రూ.240 చొప్పున ప్రభుత్వం కుట్టుకూలీ చెల్లించనుంది.