కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ స్పెషల్ టీజర్
- నేడు కమల్ హాసన్ బర్త్‌డే
- ఈ సందర్భంగా సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ స్పెషల్ టీజర్ విడుదల
- కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో ‘థగ్ లైఫ్’
- 2025 జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న తాజాగా చిత్రం ‘థగ్ లైఫ్’. ఈరోజు కమల్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ నిర్మాతలు స్పెషల్ టీజర్‌ను విడుదల చేశారు. 44 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్ మణిరత్నం స్టైల్ లో చూడగానే ఆకట్టుకునేలా ఉంది.
ఇక ఈ చిత్రాన్ని 2025 జూన్ 5న విడుదల చేయనున్నట్టు ఈ టీజర్ ద్వారా ప్రకటించారు. కాగా, ‘నాయకుడు’ చిత్రం తర్వాత దాదాపు 36 ఏళ్లకు కమల్, మణిరత్నంలో కాంబోలో ఇప్పుడు థగ్ లైఫ్ సినిమా వస్తుండడం విశేషం. ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ హీరో శింబు, సీనియర్ హీరోయిన్ త్రిష, హీరో గౌతమ్ కార్తీక్, ఐశ్వర్య లక్ష్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.