విశాఖ‌లో బ్యాడ్మింట‌న్ అకాడ‌మీకి పీవీ సింధు భూమి పూజ‌.. కీల‌క వ్యాఖ్య‌లు!

  • విశాఖలోని ఆరిలోవ‌లో సింధుకు మూడెక‌రాల స్థ‌లం కేటాయించిన ప్ర‌భుత్వం
  • అక్క‌డే బ్యాడ్మింట‌న్ అకాడ‌మీకి ఈరోజు భూమి పూజ‌
  • ఈ అకాడ‌మీ ద్వారా మెరిక‌ల్లాంటి ప్లేయ‌ర్ల‌ను త‌యారు చేస్తామ‌న్న సింధు
ఒలింపిక్ ప‌త‌క విజేత‌, భార‌త స్టార్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పీవీ సింధు ఈరోజు విశాఖ‌ప‌ట్నంలో బ్యాడ్మింట‌న్ అకాడ‌మీకి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి భూమి పూజ చేశారు. ఆరిలోవ‌లో ప్ర‌భుత్వం కేటాయించిన మూడెక‌రాల స్థ‌లంలో సింధు బ్యాడ్మింట‌న్ అకాడమీ నిర్మిస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ... ఏడాదిలోపు బ్యాడ్మింట‌న్ అకాడ‌మీ నిర్మాణం పూర్తి చేస్తామ‌న్నారు. త‌న‌కు ప్ర‌భుత్వం నుంచి పూర్తి స‌హాయ స‌హ‌కారాలు ఉన్నాయ‌ని, అకాడ‌మీ నిర్మాణానికి అన్ని అనుమ‌తులు వ‌చ్చాయ‌ని తెలిపారు. వైజాగ్‌లో బ్యాడ్మింట‌న్ నేర్చుకునే క్రీడాకారుల పొటెన్షియాలిటీ చాలా ఎక్కువ‌ని ప్ర‌శంసించారు.

ప్ర‌భుత్వ స‌హకారంతో బ్యాడ్మింట‌న్‌పై ఆస‌క్తి ఉన్న యువ‌తీ, యువ‌కుల‌కు అద్భుత‌మైన శిక్ష‌ణ ఇస్తామ‌ని సింధు తెలిపారు. త‌ద్వారా మెరిక‌ల్లాంటి ఆట‌గాళ్ల‌ను త‌యారు చేసి, అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై మెడ‌ల్స్ గెలిచేలా త‌యారు చేస్తామ‌ని అన్నారు.  


More Telugu News